Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics,వరలక్ష్మి దేవి రావమ్మా తెలుగు పాట లిరిక్స్

Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics Lyrics వరలక్ష్మి దేవి రావమ్మా తెలుగు పాట లిరిక్స్-

Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics

Video Label Sri Lakshmi Video
Song Category Devotional

Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics వరలక్ష్మి దేవి రావమ్మా తెలుగు పాట లిరిక్స్

Lyrics

“Varalakshmi Devi Ravamma” Song Lyrics

Varalakshmi Devi Ravamma Song Lyrics In Telugu

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

మా ఇంటి వేల్పు నీవమ్మ… నా కల్పవల్లి రావమ్మ

మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా

మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

అతివల మనసునెరిగి… ఐదవ తనము నోసిగి

ముత్తైదు భాగ్యమిచ్చే… మురిపాల నోము నోచి

వరలక్ష్మి దేవి వ్రతము… వరముల నొసగే తరుణం

వరలక్ష్మి దేవి వ్రతము… వరముల నొసగే తరుణం

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

భక్తి వెల్లువలలోన… భావన లహరివి నీవు

మంగళ రూపిణి రావే… మా బంగారు తల్లి నీవే

నీ పాద సేవ భాగ్యముగా… తరియించు మేము ఎల్లపుడూ

నీ పాద సేవ భాగ్యముగా… తరియించు మేము ఎల్లపుడూ

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

వరలక్ష్మి దేవి సిరి జల్లు… మా ఇంట నిలిచి వర్ధిల్లు

మమ్మేలు తల్లి హరివిల్లు… నీ వ్రతముల విరిజల్లు

నీ పాద సేవే పదివేలు… మా ఇంట అలరు మురిపాలు

నీ పాద సేవే పదివేలు… మా ఇంట అలరు మురిపాలు

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

అందాల దేవి నీవే… శింగారి సిరుల పంట

వరలక్ష్మి నోము నోచి… భాగ్యాలు పొందు నంట

వరముల నొసగే తల్లి… పూచిన పున్నాగ మల్లి

వరముల నొసగే తల్లి… పూచిన పున్నాగ మల్లి

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

మా ఇంటి వేల్పు నీవమ్మ… నా కల్పవల్లి రావమ్మ

మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా

మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics Watch Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top