Sukraram Mahalakshmi Folk Song Lyrics Lyrics -సుక్కురారం మహా లచ్చిమీ ఫోక్ సాంగ్ లిరిక్స్
ఉక్రారం మహల్‌క్ష్మి జానపద పాటల సాహిత్యం : సాహిత్యం & సంగీతం: చరణ్ అర్జున్ కొరియోగ్రఫీ మరియు దర్శకత్వం క్రిష్ సింగర్: వరం మేల్ వాయిస్; శరత్ రవి లీడ్: నాగదుర్గా నాయుడు దర్శకుడు: క్రిష్
Sukraram Mahalakshmi Folk Song Lyrics
సుక్కురారం మహా లచ్చిమీ ఫోక్ సాంగ్ లిరిక్స్
Lyrics
“SUKRARAM MAHALKSHMI” Song Info
“SUKRARAM MAHALKSHMI” Song Lyrics
SUKRARAM MAHALKSHMI Folk Song Lyrics
సుట్టు సుట్టూ సూర్యాపేట
నట్టనడుమా నల్లాగొండ
పక్కనేమో పానగల్లు
మద్యలున్నాది మా ఇల్లు
అడ్డ కాడికొచ్చి
అమ్ములేది అంటే
శిన్న పోరడైనా జెప్తడూ
నేను సుక్కురారం మహా లచ్చిమి
ఏగు సుక్కలా ఎలుగుతుంటా
క్యాచ్ మీ
నేను ఊర మాసు సోర పోరిని
కానీ దాటలేదు మా ఊరిని
ఎవ్వడాపలేడు నా జోరునీ
అయ్య ఎతుకుండు
నా వీరాధి వీరుడిని
నేను సుక్కురారం మహా లచ్చిమి
ఏగు సుక్కలా ఎలుగుతుంటా
క్యాచ్ మీ
చరణం1
కలిగినోళ్లా ఇల్లే మాది
నన్ను ఎత్తుకున్నది వీది వీది
సూడ తెళ్ళతోలు పిల్లనైనా
గోషి బోస్తే పనిబాటు దాన్ని
గడ్డి మోసుకుంటూ
గడ్డ పెరుగు తింటూ
పెరిగినాను నిండు కుండలా
నేను సుక్కురారం మహాలచ్చిమి
ఎండి తెరకు దొరకని ఎంకీ సొగసునీ
పోరగాల్ల పోరు శానా వున్నది
పోటీ రోజు రోజూ పెరుగుతున్నది
అందమింకా ఊరుతూనే వున్నది
నన్ను అందుకోని పోరా
పిల్లోడా జల్ది
నేను సుక్కురారం మహా లచ్చిమీ
విచ్చుకుంది అచ్ఛ తెలుగు నవ్వే
క్యాచ్ మీ
చరణం2
సదువుకున్నా తెలివొచ్చేదాకా
ఎక్కునైదని వదిలేసా
పుస్తకాల్లో ఏమున్నాది దునియా
ఆ పచ్చి నిజమూ తెలిసినాక
అవ్వకాడ గింత అమ్మకాడ గింత
నేర్చుకున్న లోక జ్ఞానము
నేను సుక్కురారం మహా లచ్చిమీ
నా లెక్కలో నేనే మిస్సిండియానీ
ఇది రెండు వేల ఇరవయొక్కటి
కానీ నా పద్దతి రాగి సంకటి
ట్రెండులెన్ని మారిపోతే ఏమిటి
నిత్య ట్రెండింగులే నాలో ఒక్కొక్కటి
నేను సుక్కురారం మహా లచ్చిమి
ఏగుసుక్కలా ఎలుగుతుంటా
క్యాచ్ మీ