Shukravaram Nadu Uyyalo Channiti Jalakalu Uyyalo,శుక్రవారమునాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో

Shukravaram Nadu Uyyalo Channiti Jalakalu Uyyalo,శుక్రవారము నాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో

శుక్రవారమునాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో

శుక్రవారమునాడు ఉయ్యాలో

చన్నీటి జలకాలు ఉయ్యాలో

ముత్యమంత పసుపు ఉయ్యాలో

పగడమంత పసుపు ఉయ్యాలో

చింతాకుపట్టుచీర ఉయ్యాలో

మైదాకు పట్టుచీరు ఉయ్యాలో

పచ్చపట్టుచీరు ఉయ్యాలో

ఎర్రపట్టుచీర ఉయ్యాలో

కురుసబొమ్మల నడుమ ఉయ్యాలో

భారీ బొమ్మల నడుమ ఉయ్యాలో

గోరంట పువ్వుల ఉయ్యాలో

బీరాయిపువ్వుల ఉయ్యాలో

రావెరావె గౌరమ్మ ఉయ్యాలో

లేచెనే గౌరమ్మ ఉయ్యాలో

అడెనే గౌరమ్మ ఉయ్యాలో

ముఖమంత పూసింది ఉయ్యాలో

పాదమంత పూసింది ఉయ్యాలో

చింగులు మెరియంగ ఉయ్యాలో

మడిమల్లు మెరియంగ ఉయ్యాలో

పక్కలు మెరియంగ ఉయ్యాలో

ఎముకలు మెరియంగ ఉయ్యాలో

కుంకుమబొట్టు ఉయ్యాలో

బంగారు బొట్టు ఉయ్యాలో

కొడుకు నెత్తుకోని ఉయ్యాలో

బిడ్డ నెత్తుకోని ఉయ్యాలో

మా యింటి దనుక ఉయ్యాలో

 

ఈ పాటలన్నీ బతుకమ్మ సమయంలో మన అడబిడళ్ళు పడుతూనే ఉంటారు ,   అంతేకాకుండా ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్కరూ ఈ పాటలు పాడుతూ.. బతుకమ్మను సంతోషంగా గడుపుతారు .

Shukravaram Nadu Uyyalo Channiti Jalakalu Uyyalo,శుక్రవారమునాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో