Rama Rama Rama Uyyalo Sri Rama Uyyalo,రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

Rama Rama Rama Uyyalo Sri Rama Uyyalo ,రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

 

 రామ రామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో

రామ రామ రామ ఉయ్యాలో

రామనే శ్రీరామ ఉయ్యాలో

హరి హరి ఓ రామ ఉయ్యాలో

హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో (1)

నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో

నెలవన్నెకాడ ఉయ్యాలో

పాపట్ల చంద్రుడా ఉయ్యాలో

బాల కోమారుడా ఉయ్యాలో (2)

ముందుగా నినుదల్తు ఉయ్యాలో

ముక్కోటి పోశవ్వ ఉయ్యాలో

అటెన్క నినుదల్తు ఉయ్యాలో

అమ్మ పార్వతమ్మ ఉయ్యాలో (3)

భక్తితో నినుదల్తు ఉయ్యాలో

బాసర సరస్వతీ ఉయ్యాలో

ఘనంగాను కొల్తు ఉయ్యాలో

గణపతయ్య నిన్ను ఉయ్యాలో (4)

ధర్మపురి నరసింహ ఉయ్యాలో

దయతోడ మముజూడు ఉయ్యాలో

కాళేశ్వరం శివ ఉయ్యాలో

కరుణతోడ జూడు ఉయ్యాలో (5)

సమ్మక్క సారక్క ఉయ్యాలో

సక్కంగ మముజూడు ఉయ్యాలో

భద్రాద్రి రామన్న ఉయ్యాలో

భవిత మనకు జెప్పు ఉయ్యాలో (6)

యాదితో నినుదల్తు ఉయ్యాలో

యాదగిరి నర్సన్న ఉయ్యాలో

కోటిలింగాలకు ఉయ్యాలో

కోటి దండాలురా ఉయ్యాలో (7)

కోర్కెతో నినుదల్తు ఉయ్యాలో

కొంరెల్లి మల్లన్న ఉయ్యాలో

కొండగట్టంజన్న ఉయ్యాలో

కోటి దండాలురా ఉయ్యాలో (8)

కోర్కెమీర దల్తు ఉయ్యాలో

కొత్తకొండీరన్న ఉయ్యాలో

ఎరుకతో నినుదల్తు ఉయ్యాలో

ఎములాడ రాజన్న ఉయ్యాలో (9)

ఓర్పుతో నినుదల్తు ఉయ్యాలో

ఓదెలా మల్లన్న ఉయ్యాలో

ఐలేని మల్లన్న ఉయ్యాలో

ఐకమత్య మియ్యి ఉయ్యాలో (10)

మన తల్లి బతుకమ్మ ఉయ్యాలో

మన మేలుకోరు ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బంగారు బతుకమ్మ ఉయ్యాలో (11)

 

ఈ పాటలన్నీ బతుకమ్మ సమయంలో మన అడబిడళ్ళు పడుతూనే ఉంటారు ,   అంతేకాకుండా ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్కరూ ఈ పాటలు పాడుతూ.. బతుకమ్మను సంతోషంగా గడుపుతారు .

Rama Rama Rama Uyyalo Sri Rama Uyyalo ,రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

Leave a Comment