Okkesi Puvvesi Chandamama Song Lyrics, ఒక్కేసి పువ్వేసి చందమామ


 Okkesi Puvvesi Chandamama Song Lyrics, ఒక్కేసి పువ్వేసి చందమామ

 ఒక్కేసి పువ్వేసి చందమామ రాశికలుపుదాం రావె చందమామ

ఒక్కేసి పువ్వేసి చందమామ

రాశికలుపుదాం రావె చందమామ

నీరాశి కలుపుల్లు మేం కొలువమమ్మ

నీనోము నీకిత్తునే గౌరమ్మ

అదిచూసిమాయన్న గౌరమ్మ

ఏడుమేడల మీద పల్లెకోటల మీద

దొంగలెవరో దోచిరీ గౌరమ్మ

దొంగతో దొరలందరూ గౌరమ్మ

రెండేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ

మూడేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ

రాశిపడబోసి చందమామ

రత్నాలగౌరు చందమామ

తీగెతీగెల బిందె రాగితీగెల బిందె

నానోమునాకీయవే గౌరమ్మ

ఏడుమేడలెక్కిరి గౌరమ్మ

పల్లకోటల మీద పత్రీలు కోయంగ

బంగారు గుండ్లుపేరు గౌరమ్మ

బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

ఈ పాటలన్నీ బతుకమ్మ సమయంలో మన అడబిడళ్ళు పడుతూనే ఉంటారు ,   అంతేకాకుండా ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్కరూ ఈ పాటలు పాడుతూ.. బతుకమ్మను సంతోషంగా గడుపుతారు .

Okkesi Puvvesi Chandamama Song Lyrics, ఒక్కేసి పువ్వేసి చందమామ