O Bava Kanche Ponti Kali Bata Telugu Folk Songs Lyrics ఓ బావ కంచె పొంటి కలి బాట తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్-
Song Details:
Song: O Bava kanche ponti kali bata
Lyrics: Ramesh Dumpala
Singer: Naga Laxmi
Cast: Ashok Velpula , Sneha Sharma
Editing & Direction: Harish Velpula
This song is uploaded by the Daruvu tv youtube channel.
O Bava Kanche Ponti Kali Bata Telugu Folk Songs Lyrics ఓ బావ కంచె పొంటి కలి బాట తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
O Bava Kanche Ponti Kali Bata Verses – Society Tunes Verses
Telugu Society tune oori bayata jonna chenu verses in telugu and english. This tune verses are composed by the Ramesh. Music given by the Harish and tune sung by the Nagalaxmi.
Most recent A wide range of Bhakti, Tunes, Society Melody Verses Site www.lyricspage.in/YouTube All Tunes Imbuild Association Song Tunes on this site are the right of their proprietors, we have no elite right to change the tunes. This information on lyricspage.in is gathered from web-based entertainment for diversion purposes just, for the delight in clients of our webpage lyricspage.in.
O Bava Kanche Ponti Kali Bata Lyrics In Telugu:
ఊరు బయట జొన్న చేను
జొన్న చేనుల్లో జోరైనా మంచి
కంచి పొంటి కాలి బాట
కాలి బాటల్లో నిను కలిసికుంటా
ఊరు బయట జొన్న చేను
జొన్న చేనుల్లో జోరైనా మంచి
కంచి పొంటి కాలి బాట
కాలి బాటల్లో నిను కలిసికుంటా
ఓ బావ నిను కలువ సంబరపడుతున్నది
నా కొప్పులోని కనకాంబరం
ముద్దులాడా మురిసిపోతున్నది
నా సిగలో నీ ముద్ద మందారం
దారుల్లో పూవుల తోట
పూల తోటల్లో తుమ్మెదలాట
సరసాలు సరదాలాట యాదుంది దాగుడుమూత
దారుల్లో పూవుల తోట
పూల తోటల్లో తుమ్మెదలాట
సరసాలు సరదాలాట యాదుంది దాగుడుమూత
ఓ బావ నిన్ను పట్టుకొన పట్టుపడుతున్నది
నా మట్ట మీది మట్టి గాజులు
చేరుకోన పరుగు పెడుతున్నది
నా అడుగుపైన చిట్టి పట్టిలు
వచ్చేటి దారుల్లో వాగు
తడిసి తానమాడిన అనుభవాలు
వాగు దాటితే మామిడి బాగు
బాగునిండా తీపి అనువాలు
వచ్చేటి దారుల్లో వాగు
తడిసి తానమాడిన అనుభవాలు
వాగు దాటితే మామిడి బాగు
బాగునిండా తీపి అనువాలు
ఓ బావ మధుర జ్ఞాపకాలు
మరవనంటున్నది నా సోయగాల కళ్ళ కాటుక
అనుభూతి అస్సలు అగవంటున్నాది
సొగసరి నా ముక్కు పుడక
చుట్టూ మెట్టు చెరుకు వనము
చెరుకు వనములో నా పడుచుదనము
పంచుకున్న మా చెరుకు రుచి
ఆడుకున్నామన్నది మైమరిచి
చుట్టూ మెట్టు చెరుకు వనము
చెరుకు వనములో నా పడుచుదనము
పంచుకున్న మా చెరుకు రుచి
ఆడుకున్నామన్నది మైమరిచి
ఓ బావ నువ్వు పెట్టకుంటే ఒట్టు
ఓర్చుకోదు నా నుదిటి పైన పై బొట్టు
కట్టకుంటే కుదరదు ఒప్పుకోను
నా మెడలో నా తాళి బొట్టు
O Bava Kanche Ponti Song Lyrics In English:
Uri bayata jonna chenu
Jonna chenullo joraina manchi
Kanche ponti kali bata
Kali baatallo ninu kalusukunta
Uri bayata jonna chenu
Jonna chenullo joraina manchi
Kanche ponti kali bata
Kali baatallo ninu kalusukunta
O bava ninu kalava sambara paduthunnadhi
Na koppuloni kanakambaram
Muddhulada murisi pothunnadhi
Na sigalo ni muddha mandharam
Dharullo puvvula thota
Poola thotalo thummedala aata
Sarasalu saradhalata
Yadhundhi dhagudumutha
Dharullo puvvula thota
Poola thotalo thummedala aata
Sarasalu saradhalata
Yadhundhi dhagudumutha
O bava ninu pattukona
Pattu paduthunnadhi
Na matta meedhi matti gaajulu
Cherukona parugu peduthunnadhi
Na adugupaina chitti pattilu
Vacheti dharullo vaagu
Thadisi thanamadina anubavalu
Vaagu dhaatithey mamaidi baagu
Baagu ninda theepi anavallu
Vacheti dharullo vaagu
Thadisi thanamadina anubavalu
Vaagu dhaatithey mamaidi baagu
Baagu ninda theepi anavallu
O bava madura gnapakalu
Maravanantunnadhi na soyagala kalla kaatuka
Anubuthi assal aagavantunnayi
Sogasari na mukku pudaka
Chuttu mettu cheruku vanamu
Cheruku vanamulona na paduchu dhanamu
Panchukunna ma cheruku ruchi
Adukunna madhi maimarichi
O bava nuvu pettakunte ottu
Vorchukonu na nudhiti paina pai bottu
Kattakunte kudharadhu oppukonu
Na medalo na thaali bottu