Nuvvo Raayi Neno Shilpi lyrics,నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ లిరిక్స్

 నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ లిరిక్స్

నువ్వో రాయి నేనో శిల్పి లిరిక్స్

  Nuvvo Raayi Neno Shilpi lyrics నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ లిరిక్స్

చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ అర్థవంతమైన పాట చరణ్ అర్జ్ పాడిన పాట

అన్ మరియు చరణ్ అర్జున్ రాసిన నువ్వో రాయీ నేనో శిల్పి సాహిత్యం

Nuvvo Raayi Neno Shilpi Lyrics in Telugu

హరి హారా…. ఆ…. ఆ… ఆ…

నువ్వో రాయి… నేనో శిల్పి

చెక్కుతున్నంత సేపూ

నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ

ఆ తరువతా అంటారంతా…నిన్ను దేవుడనీ

నేనో అంటరానివాడిని

నువ్వో రాయి… నేనో శిల్పి

చెక్కుతున్నంత సేపూ

నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ

ఆ తరువతా అంటారంతా…నిన్ను దేవుడనీ

నేనో అంటరానివాడిని

నీ గర్భ గుడినే కట్టేటప్పుడు…నేను పెద్ద మేస్తిరి

అది పూర్తయ్యాక లోనకొస్తావుంటే

నన్ను బయటికి తొస్తివి

నిన్ను మేలు కొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని

కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తినీ?

అయ్యో… ఓ…ఓ..ఓ… దేవా..ఆ..ఆ..ఆ

నువ్వు నడిచేటప్పుడు

నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పు

నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు

ఏంటయ్యా నా తప్పులూ?

సింగారించా నీకు బంగారు వస్త్రాలు ఎన్నో

నేసాయి నా చేతులు

కానీ నిను చూడరావాలంటే

నాకో జత బట్టల్ లేవు

ఏంటయ్యా మా రాతలు?

నీ మాసిన బట్టలే మా ప్రసాదామని

నేను శుభ్రంచేస్తిని

కానీ మైలిన పడిన వాడివంటూ

దూరంగా ఉండాలంటివి

నీ ముందు వెలిగే దీపాలు నా చెమట తో చేస్తినీ

కానీ ఎందుకో మా మాటి బ్రతుకున

ఏ దీపం పెట్టవైతివి

ఏ…

నోరే లేని మూగ జీవాలను గాయమని గోసీవో గొంగలీ ఇస్తివి

ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే లేవన్నట్లు చులకనగా వెనకబడేస్తివి

తల్లీ పాల వంటి తాటి కల్లు గీసే

నా గోసలు చూడవైతివి

వందడుగుల చెట్టు ఎక్కే

నా కళ్ళకు నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి

నీ పల్లకీ చేసిన చేతులకు

పాచిక పుల్లయిన ఇవ్వకపోతివి

ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే

నా బ్రతుకే క్షవరం చేస్తివి

మా పుట్టుక బట్టీ

చేసే పనులు బట్టీ ఏవేవో పేర్లు పెడితివీ

 

కానీ ఉన్నోడు లేనోడంటూ తేడాలు చూపి

నువ్వు కూడా మనిషి పొతివి

 

రాయికి రకరకముల రంగులు అద్ది

 

తమ దగ్గరున్న కళ తో శ్రమ తో దేవుడిగా మలిసే వాళ్ళు మాములు మనుషులు

 

అదే దేవుడిని తమ దగ్గరున్న డబ్బుతో గుళ్ళో ప్రతిష్టించే వాళ్ళు మారాజులు

 

ఇది దేవుడి రూలో మనుషుల ఆలోచనలో తెలియక

 

కులం అనే విష వృక్షాలు పెరివి పెద్దవుతున్నా

 

కుల వృత్తులనే కొమ్మలు ఎందుకు విరిగి పోతున్నాయో అర్ధం కాక

 

సతమతమౌతున్న అన్ని కులాల అన్నదమ్ములకు ఈ పాట అంకితం

 

 

Nuvvo Raayi Neno Shilpi Lyrics in Telugu

కాన్సెప్ట్-డైరెక్షన్ & ఎడిటింగ్: #సురేష్ సూర్య

సినిమాటోగ్రాఫర్: #వినీ చొప్పరి

సాహిత్యం-గాయకుడు-సంగీతం : #చరణ్ అర్జున్

తారాగణం : #BVM శివ శంకర్

ఆస్ట్-సినిమాటోగ్రాఫర్: U.S విజయ్

మ్యూజిక్ ప్రొడక్షన్ మేనేజర్: మాల్య కందుకూరి

Mahie ద్వారా G Miracles సిబ్బంది వద్ద రికార్డ్ చేయబడింది, మిక్స్డ్ & ప్రావీణ్యం పొందింది

BVM ప్రొడక్షన్ టీమ్: సుబ్బు, గిరి, జయ, సాయి,

BVM క్రియేషన్స్

G M C టెలివిజన్‌తో అనుబంధం

Nuvvo Raayi Neno Shilpi Lyrics in Telugu

 

పాట: నువ్వో రాయి నేనో శిల్పి

సంగీతం: చరణ్ అర్జున్

గాయకుడు: చరణ్ అర్జున్

సాహిత్యం: చరణ్ అర్జున్

మ్యూజిక్ లేబుల్: BVM క్రియేషన్స్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *