Okkesi Puvvesi Chandamama Okka Jamu Aye Chandamama,ఒక్కేసి పువ్వేసి చందమామా ఒక్క జాము ఆయె చందమామా

ఒక్కేసి పువ్వేసి చందమామా ఒక్క జాము ఆయె చందమామా Okkesi Puvvesi Chandamama Okka Jamu Aye Chandamama, Lyrics – ఒక్కేసి పువ్వేసి చందమామా ఒక్క జాము ఆయె చందమామా

ఒక్కేసి పువ్వేసి చందమామా ఒక్క జాము ఆయె చందమామా

Okkesi Puvvesi Chandamama Okka Jamu Aye Chandamama,

Lyrics

ఒక్కేసి పువ్వేసి చందమామా…     ఒక్క జాము ఆయె చందమామా

పైన మఠం కట్టి చందమామా…     కింద ఇల్లు కట్టి చందమామా

మఠంలో ఉన్న చందమామా…     మాయదారి శివుడు చందమామా

శివపూజ వేళాయె చందమామా…     శివుడు రాకపాయె చందమామా

గౌరి గద్దెల మీద చందమామా…     జంగమయ్య ఉన్నాడె చందమామా

రెండేసి పూలేసి చందమామా…     రెండు జాములాయె చందమామా

శివపూజ వేళాయె చందమామా…     శివుడు రాకపాయె చందమామా

మూడేసి పూలేసి చందమామా…     మూడు జాములాయె చందమామా

శివపూజ వేళాయె చందమామా…     శివుడు రాకపాయె చందమామా

నాలుగేసి పూలేసి చందమామా…     నాలుగు జాములాయె చందమామా

శివపూజ వేళాయె చందమామా…    శివుడు రాకపాయె చందమామా

ఐదేసి పూలేసి చందమామా…    ఐదు జాములాయె చందమామా

శివపూజ వేళాయె చందమామా…    శివుడు రాకపాయె చందమామా

ఆరేసి పూలేసి చందమామా…    ఆరు జాములాయె చందమామా

శివపూజ వేళాయె చందమామా…    శివుడు రాకపాయె చందమామా

ఏడేసి పూలేసి చందమామా…     ఏడు జాములాయె చందమామా

శివపూజ వేళాయె చందమామా…     శివుడు రాకపాయె చందమామా

ఎనిమిదేసి పూలేసి చందమామా…     ఎనిమిది జాములాయె చందమామా

శివపూజ వేళాయె చందమామా…    శివుడు రాకపాయె చందమామా

తొమ్మిదేసి పూలేసి చందమామా…     తొమ్మిది జాములాయె చందమామా

శివపూజ వేళాయె చందమామా…    శివుడు రాకపాయె చందమామా

తంగేడు వనములకు చందమామా…    తాళ్ళు కట్టాబోయె చందమామా

గుమ్మాడి వనమునకు చందమామా…    గుళ్ళు కట్టాబోయె చందమామా

రుద్రాక్ష వనములకు చందమామా…    నిద్ర చేయబాయె చందమామా

ఒక్కేసి పువ్వేసి చందమామా ఒక్క జాము ఆయె చందమామా Watch Video