Komuram Bheemudo Lyrics Song,కొమురం భీముడో పాట లిరిక్స్ సాంగ్(తెలుగు)

 కొమురం భీముడో పాట లిరిక్స్ సాంగ్(తెలుగు) | RRR | ఎన్టీఆర్, రామ్ చరణ్ | ఎం ఎం కీరవాణి | ఎస్ఎస్ రాజమౌళి

 

Komuram Bheemudo Lyrics Song(Telugu) | RRR | NTR,Ram Charan | M M Keeravaani | SS Rajamouli

RRR మూవీ నుండి తెలుగులో కొమురం భీముడో లిరిక్స్. కొమురం భీముడో పాటకు సాహిత్యం సుధాల అశోక్ తేజ రాశారు. కాల భైరవ పాడారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, కాలభైరవ తారాగణం. లహరి మ్యూజిక్ ద్వారా ఈ పాట డిసెంబర్ 24, 2021న విడుదలైంది.

 

పల్లవి : కొమురం భీముడో.. కొమురం భీముడో..

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

 

 

కొమురం భీముడో .. కొమురం భీముడో..

రగరాక సూరీడై రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో..

 

చరణం 1 :

కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగల..( వంగితే కనుక)

కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో..

 

జులుము గద్దెకు తలను ఒంచితోగాలా..(తల వంచితే కనుక)

జుడుము తల్లి పేగున పెరగనట్టేరో..(జుడుము అంటే అడవి)

 

కొమురం భీముడో.. కొమురం భీముడో..

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

 

చరణం 2 :

 

చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల..(తీవ్ర గాయాలకు తట్టుకోకపోతే కనుక)

 

బుగులేసి కన్నీరు ఒలికితోగాల.. (భయంతో కన్నీరు పెడితే కనుక)

భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో..

 

కొమురం భీముడో.. కొమురం భీముడో..

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

 

చరణం 3 :

కాలువ పారే నీ గుండె నెత్తురు

నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు

అమ్మకాళ్ల పారణైతుంది సూడు

తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు

కొమురం భీముడో.. కొమురం భీముడో..

పుడమి తల్లికి జన్మ భరణమిస్తివిరో కొమురం భీముడో..

 

 

 

 

 

 

దృశ్య సంగీతం

తారలు – ఎన్టీఆర్, రామ్ చరణ్, కాల భైరవ

కాన్సెప్ట్ & విజువలైజేషన్ – ప్రేమ్ రక్షిత్

DOP – రిషి పంజాబీ

సాహిత్యం – సుధాల అశోక్ తేజ

గాయకుడు – కాల భైరవ

 

చిత్రం: RRR

తారాగణం: ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్

స్క్రీన్ ప్లే & దర్శకత్వం: S.S. రాజమౌళి

సమర్పణ: డి.పార్వతి

నిర్మాత: డివివి దానయ్య

బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్

కథ: వి.విజయేంద్ర ప్రసాద్

DOP: K.K. సెంథిల్ కుమార్

ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్

సంగీత స్వరకర్త: ఎం ఎం కీరవాణి

VFX పర్యవేక్షణ: V శ్రీనివాస్ మోహన్

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

కాస్ట్యూమ్ డిజైనర్: రమా రాజమౌళి

లైన్ ప్రొడ్యూసర్ – ఎస్ ఎస్ కార్తికేయ

పోస్ట్ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్ – MM శ్రీవల్లి