Kalavari Kodalu Uyyalo Kana Mahalaxmi,కలవారి కోడలు ఉయ్యాలో..కనక మహాలక్ష్మి ఉయ్యాలో

Kalavari Kodalu Uyyalo Kana Mahalaxmi Lyrics – కలవారి కోడలు ఉయ్యాలో…     కనక మహాలక్ష్మి ఉయ్యాలో


Kalavari Kodalu Uyyalo Kana Mahalaxmi



Kalavari Kodalu Uyyalo Kana Mahalaxmi,కలవారి కోడలు ఉయ్యాలో..కనక మహాలక్ష్మి ఉయ్యాలో

 

కలవారి కోడలు ఉయ్యాలో…     కనక మహాలక్ష్మి ఉయ్యాలో

కడుగుతున్నది పప్పు ఉయ్యాలో…    కడవల్లోనబోసి ఉయ్యాలో

అప్పుడే వచ్చెను ఉయ్యాలో…    ఆమె పెద్దన్న ఉయ్యాలో

కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో…    కన్నీళ్లు తీసింది ఉయ్యాలో

ఎందుకు చెల్లెల్లా ఉయ్యాలో…    ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో

తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో…    ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో

ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో …    వెళ్లి వద్దామమ్మ ఉయ్యాలో

చేరి నీవారితో ఉయ్యాలో…    చెప్పిరాపోవమ్ము ఉయ్యాలో

పట్టెమంచం మీద ఉయ్యాలో…    పవళించిన మామ ఉయ్యాలో

మాయన్నలొచ్చిరి ఉయ్యాలో…     మమ్ముబంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో…     మీ అత్తనడుగు ఉయ్యాలో

అరుగుల్ల గూసున్న ఉయ్యాలో…    ఓ అత్తగారు ఉయ్యాలో

మా అన్నలొచ్చిరి ఉయ్యాలో…     మమ్ముబంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో…     మీ బావనడుగు ఉయ్యాలో

భారతం సదివేటి ఉయ్యాలో…     బావ పెద్ద బావ ఉయ్యాలో

మా అన్నలొచ్చిరి ఉయ్యాలో…     మమ్ముబంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో…     మీ అక్కనడుగు ఉయ్యాలో

వంటశాలలో ఉన్న ఉయ్యాలో…     ఓ అక్కగారు ఉయ్యాలో

మా అన్నలొచ్చిరి ఉయ్యాలో…     మమ్ముబంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో…     మీ భర్తనే అడుగు ఉయ్యాలో

రచ్చలో గూర్చున్న ఉయ్యాలో…     రాజేంద్ర భోగి ఉయ్యాలో

మా అన్నలొచ్చిరి ఉయ్యాలో…     మమ్ముబంపుతార ఉయ్యాలో

కట్టుకో చీరలు ఉయ్యాలో…     పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో

ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో…     వెళ్లిరా ఊరికి ఉయ్యాలో

 

 

Kalavari Kodalu Uyyalo Kana Mahalaxmi Watch Video